![]() |
![]() |

'మనసిచ్చి చూడు' సీరియల్ ద్వారా భానుగా పరిచయమయ్యింది కీర్తి భట్. ఆ తర్వాత "కార్తీకదీపం" సీరియల్ లో జనరేషన్ చేంజ్ ఐనప్పుడు చిన్నప్పటి హిమ పాత్రలో నటించి మెప్పించింది. అప్పటివరకూ కొంతమందికే తెలిసిన కీర్తి భట్ కార్తీక దీపం తర్వాత అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత కీర్తి బిగ్ బాగ్ హౌజ్ లోకి అడుగుపెట్టి తన రియల్ లైఫ్ గురించి చెప్పిందో అప్పటినుంచి తెలుగు ఆడియన్స్ ఆమె ఫాన్స్ ఇపోయారు.
తాను పెళ్లి చేసుకుంటే తల్లయ్యే అదృష్టం లేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె లైఫ్ స్టోరీ విన్న అందరి మనసు కరిగిపోయింది. అలాంటి కీర్తి లైఫ్ లోకి విజయ్ కార్తీక్ వచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కన్నడ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన కార్తీక్ 2014లో సేడు అనే మూవీలో హీరోగా నటించాడు.
తెలుగులో ఓ వెబ్‌సిరీలో, ఏబీ పాజిటివ్, చెడ్డీగ్యాంగ్ అనే మూడు మూవీస్ లో నటించాడు. ఐతే ఇప్పుడు కార్తిక్ తో కలిసి బుల్లితెర మీద వచ్చే ప్రతీ ఈవెంట్ లో కనిపిస్తోంది కీర్తి. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ లో కీర్తి ఒక పోస్ట్ ని పెట్టింది. అందులో కీర్తి కాలి గోళ్లు తీసాక నెయిల్ కట్టర్ తో వాటిని ఫినిషింగ్ చేస్తూ కనిపించాడు. ఆ పిక్ ని పోస్ట్ చేసి అక్కడ "నేను బాలేని సమయంలో నా జీవితంలోకి వచ్చావు..థాంక్యూ బంగారు బాబు" అంటూ కామెంట్ పెట్టి అక్కడ సిగ్గు పడుతున్న ఎమోజిని కూడా పెట్టుకుంది. లైఫ్ లో ఎంతో దెబ్బ తిన్న కీర్తి లైఫ్ లోకి కార్తిక్ వచ్చి మంచి జీవితాన్ని ఇచ్చాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మాటీవీలో కొంత కాలం క్రితం జరిగిన ‘మా బోనాల జాతర’ ఈవెంట్ లో కాబోయే భర్త విజయ్ కార్తీక్‌తో ఎంగేజ్‌మెంట్ జరుపుకుంది. అక్కడే అత్తమామలను కూడా పరిచయం చేసింది. తమ కుటుంబంలోకి కూతురిలా ఆమెను ఆహ్వానిస్తున్నట్లు చెప్పి భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే.
![]() |
![]() |